Wednesday, January 21, 2026

తేనీటి విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి మండలం, కాటిమాయకుంట గ్రామం, మూలపల్లె నందు మాజీ సర్పంచ్ మరియు ఎంపీటీసీ కొండా భాస్కర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తేనీటి విందు కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండలం టిడిపి ఇంచార్జ్ మదనమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మూలపల్లి గ్రామానికి చేరుకోగానే పలువురు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీ రూపంలో మంత్రికి విన్నవించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News