
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : కడుకుంట్ల గ్రామ పంచాయతీ దగ్గర తన సొంత గ్రామం అయిన కడుకుంట్ల గ్రామం పై తనకున్న అభిమానంతో శ్రీ సత్యసాయి హోమియోపతి క్లినిక్ మహబూబ్నగర్ వారు డాక్టర్ బత్తుల సాయి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించి దాదాపుగా220 మందికి పైగా ఉచితంగా హోమియోపతి మందులను పంపిణీ చేసి సైనసైటిస్ మైగ్రేయిను, దగ్గు ,జ్వరం, జలుబు ,మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అధిక రక్తపోటు ,కీళ్ల వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, మూత్ర సంబంధ వ్యాధులు, మొదలగు అనేక రకాలైన వ్యాధులకు ఉచితంగా వైద్యం చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది.గ్రామం పై అభిమానంతో ఉచితంగా వైద్యం చేసి మందులు ఇచ్చినందుకు డాక్టర్ బత్తుల సాయి కృష్ణ గౌడ్ కి గ్రామ ప్రజలు యువకులు కడుకుంట్ల గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. నాకు వీలు అయినప్పుడల్లా ఈ గ్రామానికి వైద్యం అందించడానికి ఎల్లవేళలా నేను ముందుంటానని డాక్టర్ చెప్పడంతో గ్రామ ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ నవ్య సాయి శేఖర్ గౌడ్ టీచర్,మాజీ సర్పంచ్ బాలకృష్ణ, తిరుపతయ్య గౌడ్ బీసీ వైస్ ప్రెసిడెంట్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు,ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

