- నేత్రదానంతో ఇద్దరి అంధులకు చూపు ప్రసాదించిన నేత్ర దాత గౌరిశెట్టి భవాని
- అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గాంధీనగర్ రోడ్ నివాసి నేత్రదాత గౌరిశెట్టి భవాని (48) 26.12.2024 రోజున మరణించగా నేత్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాత నివాసంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 05.01.2025 రోజు సంస్మరణ సభను ఏర్పాటు చేసి, వచ్చిన బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై కరీంనగర్ జిల్లా కన్వీనర్ మచ్చ గిరి నరహరి , అవగాహన కల్పించి కుటుంబ సభ్యులకు జ్నాపికను అందజేసినారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భర్త గౌరీశెట్టి శ్రీనివాస్ కూతురు సాయి సంయుక్త మరియు సహకరించిన గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్, చిటికేసి శివానందయ్య, చిదురాల శ్రీనివాస్ ముత్యాల జగదీశ్వర్, వంగల రమేష్, కాసం నాగరాజు రావికంటి రాజేందర్ లకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

