
నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో :
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలిలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ కి వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జ్ పేరాడ తిలక్ తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం టెక్కలిలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరవుతున్న బొత్స సత్యన్నారాయణ ని కోటబొమ్మాలి వద్ద స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందిగాం, కోటబొమ్మాలి ఎంపీపీలు, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి జడ్పిటిసి సభ్యులు తోపాటు నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

