- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రుద్రంగి మండలం మానాల గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి మాలోత్ నరహరి నాయక్ ఉద్యోగ విరమణ సందర్భంగా మానాల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తిరుగు ప్రయాణంలో గ్రామానికి చెందిన బిఆర్ యస్ పార్టీ యువ కార్యకర్త పిసరి రవీందర్ స్వగృానికి వెళ్లి కార్యకర్త బాగోగులు తెలుసుకున్నారు. నా గెలుపుకోసం చాలా కష్టపడ్డావు బిడ్డ.. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అంటూ మాజీ మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి పలకరించారు. రవీందర్ కుటుంబం సభ్యులతో ఆప్యాయంగా ఫోటో దిగారు. నువ్వు కూడా రానున్న రోజుల్లో మంచి నాయకుడిగా ఎదగాలని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు వున్నా నేను నీకు ఉన్నా బిడ్డ అని భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పి వెళ్లారు.

