మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ఉద్యోగం పొందిన నాటి నుండి పదవి విరమణ అనేది తప్పనిసరిగా ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మానాల గ్రామంలో జరిగిన మాలోత్ నరహరి నాయక్ (డిప్యూటీ డైరెక్టర్,టౌన్ ప్లానింగ్) పదవి విరమణ కార్యక్రమానికి మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మానాల మొహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు నరహరి సన్నిహితులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లడుతూ… నరహరి నిబ్బద్దతతో కూడిన వ్యక్తి అని, ఒక ఉద్యోగిగా తన బాధ్యతను నిర్వర్తించి అలాగే ఒక తండ్రిగా కుటుంబాన్ని నడిపి, గతంలో ఉద్యోగానికంటే ముందు రాజకీయ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసి సంపూర్ణ జీవితం అనుభవించారని అన్నారు. ఉన్నత మైన హోదాలో పదవి విరమణ పొంది పట్టణంలో మంచి జీవనం కొనసాగించే అవకాశం ఉన్న కని పెంచిన తల్లి తండ్రులను చూసుకోవాలని మానాల గ్రామంలో లోనే మిగతా జీవితాన్ని గడపడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అందరికి ఆదర్శప్రాయం అని అన్నారు. అతను చేసింది ఉద్యోగ విరమణ మాత్రమే అని ఇకముందు కూడా ఆయురారోగ్యాలతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
నరహరి ప్రస్థానం…!
నాడు మారుమూల గ్రామం మానాల లోని ఒక వ్యవసాయ కుటుంబం మాలోత్ హర్సింగ్ నాయక్,అమృత లకు జన్మించిన ప్రస్తుత రిటైర్ ఉద్యోగి నరహరి నాయక్.. ఆ నాటి కాలం లో బడికి పోదాం అంటే రోడ్డు లేని కాలం లో తన అమ్మమ్మ గ్రామంలో విద్యను అభ్యసించి బిఈ చదివిన మానాల మొదటి పౌరుడు గా పేరొంది. 1988 నాటి కాలం లో ఒక పక్క నక్సలైట్లు పాలిస్తున్న గ్రామానికి ఒక గిరిజన బిడ్డ గ్రామ ప్రథమ పౌరుడు గా (సర్పంచ్) గెలుపొంది గ్రామానికి అభివృద్ధిలో ఉత్తమ సర్పంచ్ గా పేరు తెచ్చుకొని తనపేరు మీదనే ఒక గ్రామం సర్పంచ్ తండా అని నామకరణంగా, నేడు గ్రామంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని రుద్రంగి మండలం లో ఉంది అంటే అది నిజంగా తనకు దక్కిన గౌరవం ఇలా ఇంకొకరికి ఊహకు అందని విధంగా గ్రామానికి అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న తరుణం లో ఒక అనుకోని సంఘటన తో గ్రామానికి వదిలి పట్నం (హైదరాబాద్) వెళ్లి కసితో కష్టపడి చదివి ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా పదోన్నతి సాధించి డిప్యూటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా రాష్ట్రం లో ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు సాధించి మానాల ప్రజలు గర్వ పడేలాగా గ్రామం యొక్క గౌరవాన్ని వన్నె తెచ్చిన నరహరిని చూసి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

