నేటి సాక్షి, వీణవంక : ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు చాలావరకు నివారించవచ్చని వీణవంక ఎస్.ఐ. అన్నారు. ఆదివారం రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా చల్లూరు గ్రామంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. అతివేగం కూడా ప్రమాదాలకు కారణం అవుతుందని, వేగాన్ని తగ్గించి సురక్షితమైన ప్రయాణం చేయాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జనుమానులతో పాటు జైలు శిక్షలు కూడా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతోనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనం నడిపేప్పుడు వాహనదారుని నమ్ముకొని ఉన్న కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తో పాటు అధిక సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు

