Thursday, January 22, 2026

సైన్స్ లో విదేశీయుల కన్నా ముందే అన్ని ఆవిష్కరణలు భారతీయులే చేశారు

  • గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
  • సైన్స్ ఫెయిర్ బహుమతుల ప్రధానోస్తవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే
  • విశిష్ట అతిథులుగా హాజరైన గద్వాల్ సైంటిస్ట్ జయతీర్థరావు,
  • మాజీ వైస్ ఛాన్స్లర్ రాజేశ్వర్ రెడ్డి
  • పాల్గొని బహుమతుల బహుకరించారు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ నందు గత రెండు రోజులుగా జరుగుతున్న 57వ జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శిని 2024-2025, జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఆవిష్కరణల ప్రదర్శన 2023-2024 చాలా విజయవంతంగా ముగిసింది. మొత్తం 207 ఎగ్జిబిట్స్, 39 ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ మొత్తం 248 ఎగ్జిబిట్స్ పాల్గొన్నారు. పదిమంది జడ్జిల టీంతో విజేయతలను ప్రకటించడం జరిగింది. ఏడు విభాగాలలో ఎగ్జిబిట్స్ లో విజేతలను ప్రకటించడం జరిగింది. వీరిలో సీనియర్స్ ప్రథమ బహుమతులు పొందిన విద్యార్థులు జడ్చర్లలో జరగబోయే రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొననున్నారు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్ చాలా చక్కగా నిర్వహించారని నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు అని తెలిపారు. చాలా చక్కని ఆవిష్కరణను చూసి అక్చర్యపోయానని మన విద్యార్థులు ఎటువంటి సైంటిస్ట్ లకు తక్కువ కాదని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని దేశం అభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్దారిస్తుందని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం పోటీ పడుతుందని తెలిపారు. బాల బాలికలు చాలా చక్కని ఎగ్జిబిట్స్ ను ప్రజెంట్ చేశారని గెలుపొందిన వారు మాత్రమే కాక మిగితా వారికి కూడా సైన్స్ పట్ల జిజ్ఞాస పెరుగుతుందని అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులలో మార్పు రావాలని వారు చేసే ప్రయోగాలలో వారిని గమనిస్తూ ప్రోత్సాహించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ జంబూ రామన్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, డి ఈ ఓ అబ్దుల్ గని, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ పాపన్న, బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇమాన్యుల్, గద్వాల్ ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ లు ప్రతాప్ రెడ్డి, నల్లారెడ్డి, వెంకటేష్, అమీర్ పాషా, సురేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News