- తనిఖీలు చేసిన చేర్యాల ఎస్ఐ నిరేష్
- జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం
నేటి సాక్షి చేర్యాల : చేర్యాల ఎస్ఐ నిరేష్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం కైట్స్ పతంగుల షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను ఎవరైనా కలిగి ఉన్నా ఇతరులకు అమ్మిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నైలాల్, నింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరం రోడ్లపై, మోటార్ సైకిల్ తో వెళ్లే వారికి అది చూడకుండా మెడకు కాళ్లకు తట్టుకొని చనిపోయిన సంఘటనలు చాలా జరిగాయి. పర్యవరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాలను మేరకు చైనా మాంజా విక్రయాలు, వినియోగం చేసే వారి పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఏవరైన చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్ 100నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. చేర్యాల మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు ప్రయాణికులకు ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనల గురించి ఎస్సై నీరేష్ మరియు సిబ్బంది అవగాహన కల్పించారు.

