- రైతాంగాన్ని నిలువు దోపిడీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసనశగా

నేటిసాక్షి, సైదాపూర్ :
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పాత బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమవారం రాజయ్య మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతులకు సంఘీభావంగా 2 లక్షల వరకు గలఋణాలను ఆంక్షలు లేకుండా రుణ మాఫీ చేయాలని, ఎకరానికి 7500 రైతు భరోసాఇవ్వాలని ఆరు గ్యారంటీ లను ప్రభుత్వ హామీలను అమలు చేయాలని డిమాండు చేస్తు మహాలక్ష్మి మహిళలకు ఇస్తానన్న 2500 వెంటనే అమలు చేయాలి. వృద్ధులకు వికలాంగులకు చేయూత పింఛన్ 6000 పింఛన్ వెంటనే అమలు చేయాలి, భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు వెంటనే అమలు చేయాలి, యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డ్ అమలు చేయాలి, రైతులకు కూడా ఎకరానికి 15 వేల రూపాయలు అమలు చేయాలి, అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి, బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యానికి లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. మండలానికి చెందిన 26 గ్రామపంచాయతీలో పరిధిలోని రైతులతో కలిసి నిరసన నిర్వహించామని తెలిపారు. అధిక సంఖ్యలో వచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, మాజి వైస్ ఎంపీపీరావుల శ్రీ దర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ చాడా ప్రకాష్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎల్కపల్లి రవీందర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వి. రమేశ్, మునిపాల శ్రీనివాస్, పొడిశెట్టి శ్యామ్, ఎసిక అయిలయ్య, పొడిశెట్టి శ్యామ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బి శంకర్ నాయక్, టీ రజనికాంత్, పి రవీందర్ గౌడ్, పి కొమురయ్య, వి మోహనరావు, డి రమణ చారి, కె విజయ్, మాదం స్వామి, దూల సురేష్, వి శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు, రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


