

నేటిసాక్షి, హనుమకొండ:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవ చారి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ (ఇ.వి) బస్సులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, ఎంఎల్ సి బస్వరాజు సారయ్య, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, KUDA చైర్మన్ ఇనగల వెంకట్రాం రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు రోడ్డు రవాణా సంస్థ అధికారులు, జిల్లా కలెక్టర్ లు పి. ప్రావీణ్య, సత్యశారద, NPDCL చైర్మన్ తదితతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వాహనాలను మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు.

మొత్తం 112 ఎలక్ట్రికల్ (ఇవి) బస్సులను జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే అమలు చేసిన మొట్టమొదటి పథకం మహాలక్ష్మి పథకం, గడిచిన ఏడాది కాలంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 127 కోట్ల మహిళలు ప్రయాణాలు చేశారు, మహిళల్లో ఉచిత బస్సు పథకం ద్వారా సామాజిక అభ్యున్నతి కలిగింది, హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి 112 ఇవి బస్సులు రాష్ట్ర నలుమూలలకు నడవనున్నాయి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నామని, పదేళ్లలో కనీస మౌళిక వసతులు కల్పించడంలో విఫలం అయిన గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

హనుమకొండలో మంత్రుల పర్యటన సందర్భంగా అక్కడక్కడ అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారంటూ మీకు ప్రజలే బుద్ధి చెప్పిన కూడా ఇంకా తత్వం మారకపోవడం సిగ్గుచేటని వాఖ్యానించారు. సంక్రాంతి పండుగ తరువాత కొత్త రేషన్ కార్డ్ లు, పెన్షన్లు పంపిణీ, ఇందిరా రైతు భరోసా పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

