నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కేంద్ర హోం మంత్రి అమీషా అంబేద్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాల మహానాడు ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో స్థానిక మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున మాలమహా నాడు నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోం మంత్రి అమీత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిండు పార్లమెంటులో అంబేద్కర్ ను అవహేళన చేసే విధంగా మాట్లాడడం అప్రజాస్వామిక మన్నారు.అమిత్ షా తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ పదవి నుండి ఆయనను బర్త్ రఫ్ చేయాలన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సొల్లు బాబు, రాష్ట్ర నాయకులు పసుల స్వామి ,జిల్లా నాయకులు తొగరు స్వామి, మండల నాయకులు తొగరు సంపత్, డివిజన్ నాయకులు నీరటి రమేష్ తదితరులు ఉన్నారు.

