- కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలు
- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుండెల్లో పెట్టి చూసుకుంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.పెద్దమందడి మండలం బుగ్గపల్లి తాండలో సోమవారం ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు నిరుపేదలందరికీ ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామాల్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ సత్య రెడ్డి, రామచంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రమేష్ యాదవ్ స్థానిక నాయకుడు గోపాల్ నాయక్, గట్టు యాదవ్, టైలర్ రవి, రాఘవేందర్, బాలు, మంగ్యనాయక్, భీమ్ సింగ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

