Thursday, January 22, 2026

రేవంత్ రెడ్డి డౌన్, డౌన్ నినాదాలతో దద్దరిల్లిన గద్వాల్

  • తెలంగాణ రైతంగం ఈ ప్రభుత్వ ద్రోహిని క్షమించారు
  • వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి
  • రైతులుతో కలిసి,రోడ్డు పై కూర్చొని నిరసన తెలిపిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు
  • బాసు హనుమంతు నాయుడు గారు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా రూ.15,000/- రెండు లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు..బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్నందు రైతులతో కలిసి,ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, సీఎం డౌన్, డౌన్, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ..
రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని,రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని గుర్తు చేశారు…రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో 7,500 చొప్పున ఇస్తామని చెప్పి 6,000 లే ఇస్తామని అనడం సిగ్గు అనిపించలేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు…?కేసీఆర్ గారి మానస పుత్రిక,ప్రపంచమే మెచ్చిన రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది అని అన్నారు…వాన కాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో పాటు కలిపి ఎకరానికి 15,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు… బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగస్ గానే మిగిలిపోయింది అని అన్నారు..నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్ కు తగిన సమయంలో బుద్ధి చెప్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోనేష్, అంగడి బసవరాజ్, శేఖర్ నాయుడు,శ్రీ రాములు, గంజిపేట రాజు, తిరుమలేష్, ఎస్.రాము నాయుడు, ముని మౌర్య,ఎండి. మాజ్, దరూర్ వెంకటేష్ నాయుడు, మాజీ సర్పంచ్ సామేలు, అబ్రహం, తిమ్మప్ప గౌడ్, ఆటో ముక్బాల్, మల్లాపురం రవి, బాసు గోపాల్, కంగారు తిమ్మప్ప, రవి నాయుడు, నాగరాజు, వీరేష్, నక్క రవి, పరుషరాముడు, బాసు నాయుడు, లోకేష్, నల్లగట్ల రాముడు, శ్రీనివాసులు, ఆంజనేయులు, కృష్ణ, అనిల్, కామేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News