- మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు
- అంబేద్కర్ చౌక్ లో రాస్తారోకో
నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న) : రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి రైతుకి ఎకరానికి 15000 చెల్లించాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందేందీ, చేస్టేదేందన్నారు. పెంచిన రెండు వేలు ఏవని, ముష్టి వేస్తున్నరా అని మండిపడ్డారు. తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు అమలుచేసి కేసీఆర్ రైతుబంధుగా నిలిస్తే.. హామీలకు కోతపెడుతూ రేవంత్‌రెడ్డి రాబందుగా మారాడన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందన్నారు. రైతుభరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి, 12 వేలకు కుదించడమంటే రైతులను నిలువునా వంచించడమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటేందుకే రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని, ఈ ద్రోహాన్ని రైతులు ఎప్పటికీ క్షమించరన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చిప్పకుర్తి నారాయణ, చందపాషా, ఎండీ అన్వార్, చతరాజీ రాజన్న, యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్, శనిగరపు వెంకటేష్, తోటపల్లి మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

