Tuesday, March 10, 2026

ప్రారంభమైన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్

  • RVMBP అకాడమీ ఆధ్వర్యములో

నేటి సాక్షి,బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రము పోతారం రోడ్డులో గల క్రికెట్ క్రీడమైదానంలో RVMBP అకాడమీ ఆధ్వర్యములో ప్రారంభమైన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ – 2025 ను ముఖ్య అతిధిగా అడ్వకెట్ రఘువీర్ హాజరవ్వగా ఎస్సై జె కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ జె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తి, స్నేహభావం, శారీరక దృఢత్వం, ఏకాగ్రత, పట్టుదల కలగలిపి ఆడుకునేందుకు మంచి వేదికలుగా క్రీడలు దోహదపడుతున్నాయి. యువత తప్పుడు దారిలో నడవకుండా మంచి లక్షణాలను అలవరుచుకుని దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా నిలవాలని మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మండల కేంద్రములో సమన్వయముతో రెండు టోర్నమెంట్లు నిర్వహిస్తూ మండల కీర్తిని పెంచుతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా ఆడుకోవాలని   క్రీడాకారులు మరియు నిర్వహలను ఉద్దేశించి మాట్లాడారు.
నిర్వాహకులు సంగేమ్ మధు, మానల రవి, దోనె వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.
నాన్ పొలిటికల్, నాన్ కమర్షియల్ భావనతో, బెజ్జంకి మండలములో కొందరు తమ పిల్లలను క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యముతో నగరాలలో చిన్న బడులలో, అద్దె ఇళ్లలో ఉంచి నెల నెల వేలల్లో ఖర్చు చేసి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఇక్కడే ఒక గ్రౌండ్ చూసుకుని ఒక కోచ్ ను బెజ్జంకి మండలానికి తీసుకుని వచ్చి ఇక్కడే ట్రేనింగ్ ఇప్పిస్తే ఖర్చుతో పాటు పిల్లలు మనతోనే ఉంటారు. అదే విధంగా ఓపెన్ టూ అల్ విధానం ద్వారా నైపుణ్యం ఉన్న క్రీడారులు ఆడటంతో పాటు గ్రామీణ క్రికెట్ క్రాడాకారులు మెళుకువలు నేర్చుకునే అవకాశం కూడ ఉంది. రానున్న రోజుల్లో గ్రామీణ క్రీడాకారులకు స్వల్ప రుసుముతో వివిధ క్రీడల ట్రైనర్లతో శిక్షణ ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News