నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మసొత్సవాల సందర్భంగా హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల రోడ్డు భద్రత గురించి పలు సూచనలు చేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ జనవరి మాసాన్ని జాతీయ రోడ్డు భద్రత మాసం సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తామని అన్నారు. వాహన దారులు రోడ్డుపై వాహణాలు నడిపేటపుడు రోడ్డు భద్రతా నినమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతిఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. అది మీకు మీ కుటుంబానికి ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుందని చెప్పారు. అతివేగం ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. మధ్యం సేవించి వాహణాలు నడుపవద్దని, మధ్యం సేవించి పట్టుబడ్డ వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. తమ తమ ఇంటికి క్షేమంగా వెళ్ళాలంటే రోడ్డు భద్రతా నియమాలను తప్పని సరిగా పాటించాలన్నారు. చిన్న పిల్లలలకు, మైనర్లకు వాహణాలు ఇవ్వరాదని, ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఓ. సిబ్బంది, అటో డ్రైవర్లు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.





