Monday, March 9, 2026

రైతు భరోసా 15000 ఇవ్వాల్సిందే

  • బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు
    పాకాల మహిపాల్ రెడ్డి

నేటి సాక్షి, బెజ్జంకి: గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి  రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.15,000 ఇచ్చేలా రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. మేనిఫెస్టోను పవిత్రంగా కాపాడతామని చెబుతూ, అనంతరం మంత్రిమండలి ఉప సంఘం అంటూ కాలయాపన చేయడం ద్వారా రైతులను మోసం చేస్తున్నారని మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం బెజ్జంకి మండల వ్యవసాయ అధికారిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ. 15,000 రైతు భరోసా అందించాలి.రుణమాఫీ పూర్తిస్థాయిలో చేపట్టాలని, అసెంబ్లీలో సీఎం ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ రైతుల కనీసం 50% రుణమాఫీ పూర్తి కాలేదని వివరించారు.మండలంలోని 12,000 మంది రైతులకు 2023 వరకు రూ. 122 కోట్లు రైతుబంధు ద్వారా అందించామన్నారు. రెండు లక్షల లోపు మరియు రెండు లక్షల పైన రుణమాఫీ కానీ రైతుల కు వెంటనే రుణమాఫీ విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపాలని వ్యవసాయ అధికారిని కోరారు.ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, శ్రీనివాస్ గుప్తా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బండి రమేష్, మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు, సంజీవ్ రెడ్డి,మాజీ  ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు దుంబాల మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముక్కిస తిరుపతి రెడ్డి, దీటి బాలనర్సు, టౌన్ ప్రెసిడెంట్ వంగళ నరేష్, బిసి సెల్ ప్రెసిడెంట్ కల్లూరి రమేష్ యాదవ్, నాయకులు  నలువాల స్వామి, ఎలుక దేవయ్య, తడిచెట్టు భూమయ్య, సోషల్ మీడియా ఎలా శేఖర్ బాబు, డైరెక్టర్ దీటి రాజు, బిగుల్లా సుదర్శన్, బిగుల్లా మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News