నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : గద్వాల్ నియోజకవర్గం లోని ధరూరు మండలం అల్లాపాడు గ్రామంలో దారుణం జరిగింది. అన్నాతమ్ముల మధ్య భూ తగాదాలు పెద్ద వెంకటరెడ్డి అనే వ్యక్తి భూమిని అనుమతి లేకుండా తన తమ్ముడు చిన్న వెంకటరెడ్డి రేణుక వేరే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఎలా అమ్ముతారు అని అడిగినందుకు తన పైన దాడి చేసి తీవ్రంగా హింసించారు. బెదిరింపులకు గురిచేసి తన పైన తమ కొడుకు పైన అక్రమ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేసినందుకు తీవ్ర మనస్థాపానికి 31-12-2024 రోజున పురుగుల మందు తాగి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6-1-2025 రోజున చనిపోవడం జరిగింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లి చనిపోయి 24 గంటలు అయినా చావుకు కారణమైన రేణుక చిన్న వెంకటరెడ్డిని అరెస్టు చేయని పోలీసులు.





