- గ్రామాలలో మౌలిక వసతులతో అభివృద్ధి పనులు
నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో: గ్రామాలలోని అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు ఎంఎల్ఏ గౌతు శిరీషమ్మ కట్టుబడి ఉన్నారు అని, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు అన్నారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం గ్రామం మంకినమ్మ అమ్మవారిగుడి నుండి పైల పార్వతమ్మ ఇంటివరకు సుమారు ఆరు లక్షల రూపాయల నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీపాన గోపి, ఉపసర్పంచ్ గుంట సత్యం, కాంట్రాక్టర్ పాలిన మోహనరావు, టీడీపీ సీనియర్ నాయకులు పాలిన చంద్రయ్య, పాలిన నాగు, రత్నాల తుంభనాథం, పూడి రమణ తదితరులు పాల్గొన్నారు.





