- తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు
- రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్
నేటిసాక్షి, హనుమకొండ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం ప్రక్కన సివిల్ సప్లయి గోడౌన్ ముందు సివిల్ సప్లయి హమాలీ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ సమ్మెలో ఉన్న కార్మికులకు పూల దండలు వేసి సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లయి హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టాడం జరిగిందన్నరు. గతంలో సివిల్ సప్లయి కమిషనర్ కార్మికులతో ఒప్పుకున్న దాని ప్రకారం G.O అమలు చేయక పోవడం శోచనీయం అన్నారు. పెరిగిన రెట్ల G.O అమలు చేయకపోవడం పై ఏదో మతాలబు కార్మికులకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రజలకు విద్యార్థులకు అంగన్వాడీ సెంటర్లకు MDM పిల్లలకు జరుగుతున్న ఇబ్బందులకు కారణం కమిషనర్ గారే అన్నారు. ఒప్పుకున్న రెట్ల ఒప్పంద G.O 4 నెలలు అయినా కూడా అమలు చెకపోవడం పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలతో సహా ఒప్పంద G.O ను అమలు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించి కార్మికులకు 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం వీరి న్యాయమైన డిమాండ్స్ ను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించి సమ్మెను నిలుపుదల చేయాలని లేకుంటే సివిల్ సప్లై హమాలీ కార్మికులకు వారి చేసే పోరాటాలకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ మద్దతు ఉంటుందని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏఐటియూసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు, వేల్పుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి జక్కురాజు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 7 రోజుకు చేరుకున్న హమాలీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం హమాలి కార్మికుల కార్మికుల ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న రేట్ల ఒప్పందాన్ని జీవోను విడుదల చేయాలని చేయాలని న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమ్మె కు మద్దతు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చలగా మోహన్ , తోట సమ్మయ్య, ఆకుల పోతరాజు రమేష్, గౌరీ, సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియూసి ఉపాధ్యక్షులు బత్తిని సదానందం, కూటు అధ్యక్షులు కుక్కల మల్లయ్య, కునుకుల బిక్షపతి, కన్నబోయిన కుమార్ యాదవ్, బోయిన సమ్మయ్య, ఆకుల సుధాకర్, బోయిని కట్టయ్య, హమాలి కార్మికులు పాల్గొన్నారు.





