- అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్
- జిల్లా రవాణా శాఖ అధికారి మానస

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో హెల్మెట్ పెట్టుకొని ద్విచక్ర వాహనం నడిపే వారిని, సీట్ బెల్ట్ తో కార్ నడుపుతున్న వారిని జిల్లా రోడ్డు రవాణా అధికారి మానస, పోలీస్ సిబ్బందితో కలిసి వాహన దారులకు పువ్వులు ఇస్తూ అభినందించారు.

వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాన్ని రక్షించేందుకు రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరైతే నిబంధనలు పాటించడం లేదో అలాంటి వారిని జరిమానాలు విధించాలని రోడ్డు రవాణా అధికారిని ఆదేశించారు. జిల్లాలోని వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అడ్డం దిడ్డంగా, అధిక వేగంతో నడపకుండ రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోరారు. వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర, మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్రారెడ్డి, డి.పి.ఆర్. ఒ సీతారాం, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





