Tuesday, March 10, 2026

జమ్మికుంట పట్టణంలో యూటర్న్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు

  • సమస్య పరిష్కరించాలని ఆర్ అండ్ బి అధికారులకు వినతిపత్రం
  • యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్

నేటి సాక్షి, జమ్మికుంట : జమ్మికుంట నుండి హుజురాబాద్ రోడ్డుకు వెళ్లే దారిలో డివైడర్ కు సంబంధించి దగ్గర దగ్గరలో యూటర్న్ ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా ఫంక్షన్ హాల్స్, మిల్లులు, బార్, హోటల్స్ లాంటివి రోడ్డును అనుకొని ఉన్నందున నిత్యం ఆ చోట రద్దిగా ఉంటుంది. అక్కడ డివైడర్ తొలగించి ఉండడం వల్ల ఎవరికి వీలుగా వాళ్ళు వాహనాలతో రోడ్డు క్రాస్ చేయడం జరుగుతుంది. రోడ్డు ప్రమాద సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల కాలినడకన వెళ్లే వారికి కూడా భద్రత లేదు అని అధికారులకు తెలుపగా వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యల తీవ్రతను పర్యవేక్షించడం జరిగింది. ఇట్టి సమస్యపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబుకి ఫోన్ కాల్ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి దానికి సంబంధించిన నిధులు వెంటనే మంజూరు చేయడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అధికారులు ఈ సమస్య పట్ల వెంటనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోయూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, కార్యదర్శి ఏబుషి అజయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజకొమురయ్య,పచ్చిమట్ల భాను, జావిద్, విజయ్, ప్రణయ్ తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News