Tuesday, March 10, 2026

దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు

  • దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ): ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం రోజున ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలోని ఈవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఏర్పాట్ల పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.సమావేశానికి ముందు దేవాలయంలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి, అన్నదాన మరియు దర్శన టికెట్ల కౌంటర్లను ప్రారంభించారు .ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపురి నియోజక వర్గ ప్రజలు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నామని, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని,గత ఏడాది ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటిని సమీక్షించుకుంటూ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వేద పండితులు, అర్చకుల సూచనల మేరకు, సమయపాలనకు అనుగుణంగా వైకుంఠ ద్వారాలను తెరవాలని సూచించడం జరిగిందని, ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులుమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News