నేటి సాక్షి,మెట్ పల్లి : మెట్ పల్లి మండలం పెద్దాపూరు గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాస్ కు తల్లిదండ్రులు వినతి పత్రం సమర్పించారు. డార్మెట్రీ భవనం నిర్మించి అటాచ్ బాత్రూంలను నిర్మించాలని,డైనింగ్ హాల్ ను విస్తరించాలని,ప్రహరీ గోడ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు బిగించాలని కోరారు.వేడి నీటి కోసం గ్రీసర్లు ఏర్పాటు చేయాలని విన్నవించారు.మరొక ఏఎన్ఎం ను నియమించి ప్రతి నెల వైద్య శిబిరాలు పెట్టాలని కోరారు.





