కలెక్టర్కు భూమి అప్పగించిన సంచల కుమారస్వామి..
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల
మూడెకరాల ప్రభుత్వ భూమిని సంచల కుమారస్వామి తిరిగి ప్రభుత్వానికి అప్పగించారని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ…
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సంచల కుమారస్వామి గ్రామ సర్వేనెంబర్ 464లో గల మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేస్తున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని అన్నారు. జిల్లాలో ఎవరైనా భూఅక్రమణులకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, భూములను పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని అన్నారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి అక్రమణాలో ఉంటూ రైతుబంధు, పిఎమ్ కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్మును రికవరీ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 250 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.





