నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘ ఉపాధ్యక్షుడిగా మార్త సతీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునన్నట్టు రాష్ట్ర శాఖ తెలిపింది. కోరుట్ల పట్టణంలో మరియు పరిసర గ్రామాల్లో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తిగా అందరికీ సుపరిచితుడే. అదే విధంగా ఎంతోమంది అన్నార్తులకు కూడా సాయంగా నిలిచేవాడని తాము గుర్తించామన్నారు. ఇలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ అభివృద్ధికి దోహదపడతాడని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర సంఘ నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.





