Tuesday, March 10, 2026

వీక్లీ మార్కెట్లో రాస్తారోకో

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టిఎన్ రమేష్ : నిజామాబాద్ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో, బుధవారం రోజు రోడ్డుపై కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు రాస్తారోకో నిర్వహించారు. పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులకు, తమ గోడును మొరపెట్టుకున్న, తమను పట్టించుకున్న నాధుడే లేడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గత 30 సంవత్సరాలుగా కూరగాయల వ్యాపారం వీక్లీ మార్కెట్లో రోడ్డుకి ఇరువైపులా కొనసాగిస్తున్నామని, కొంతకాలంగా అధికారులు, ట్రాఫిక్ జామ్ అవుతుందని కారణం చెబుతూ తమ పొట్టపై కొడుతున్నారని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు సానుకూలంగా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాస్తారోకో ద్వారా, తమ నిరసనను తెలియజేస్తున్నామని, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News