Tuesday, March 10, 2026

ఉచిత వైద్య శిబిరం

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) :
నూతన సంవత్సరంలో సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే మంచి కార్యాలతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో మినీ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని దేశ స్వేచ్ఛ సంపాదకీయుడు, రచయిత పల్లె శాంతిరాజ్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 9, 10 వార్డు సభ్యుల కోసం బుధవారం పల్లె శాంతరాజ్ అయన సతీమణి రమ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పన్నపేట, సెంట్ ఆన్స్ ఆసుపత్రికి చెందిన వైద్యురాలు పియోరినా స్వచ్ఛందంగా పాల్గొని, రోగులను పరిశీలించి, రక్త పరీక్షలు చేసి, మందులను పంపిణీ చేశారు. ఉచితంగా మందులను పంపిణీ చేసినందుకు గ్రామస్తులు పల్లె శాంతిరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్స్ హెలెన్, సుమ, అక్షయ,పల్లె రాయమల్లు, నాగభూషణం, గిద్యోను, అజయ్, పులిపాక అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News