నేటిసాక్షి, హుజూరాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కోడెం కనకయ్య చే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ టా ప్ర హుజురాబాద్ ఎస్ టి ఓ శాఖ అధ్యక్షులు శనిగరం నరేందర్ ఆధ్వర్యంలో ఆవిష్కరింప చేయనైనది. ఇట్టి కార్యక్రమంలో టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ గౌరవాధ్యక్షులు కట్ట నాగభూషణ చారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ తో పాటు ఈపీఎఫ్ 95 మరియు సీఎం పిఎఫ్ 98 సింగరేణి కార్మికుల కొరకు అప్రమత్తంగా పనిచేస్తున్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ టా ప్ర అని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వము ఎన్పీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పొందుపరచి వాగ్దానము చేసిన ప్రకారము పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేసినారు. ఈపీఎఫ్ 95 సింగరేణి కార్మిక పెన్షనర్స్ కు కనీసం 15 వేల రూపాయల పెన్షన్ చెల్లించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము తాను ఇచ్చిన మాట ప్రకారం నూతన పిఆర్సి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆరు నెలల లోపు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సరియైన విధానము కాదని తక్షణమే నూతన పిఆర్సి ని జూలై 2023 నుండి అమలు చేస్తూ పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ తాటి శేఖర్, టా ప్ర జిల్లా శాఖ ఉపాధ్యక్షులు బోంగోని వెంకటయ్య, సయ్యద్ మునీరుద్దీన్, రావికంటి రామకృష్ణయ్య, హుజూరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి, నాయకులు సొల్లేటి మల్లారెడ్డి, గొట్టే జమదగ్ని, గంగిశెట్టి సాంబయ్య, తాటిపాముల కనుకయ్య, తౌటమ్ శ్రీహరి, తాళ్లపల్లి రామకృష్ణ, మునిగంటి రవీందర్, ముక్క మొగిలయ్య, చింత సమ్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.





