Tuesday, March 10, 2026

ఎమ్మెల్యే క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టిఎన్ రమేష్ :
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, నిజామాబాద్ మాల సంక్షేమ సంఘం గంగస్థాన్ 2 క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేద్కర్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రాలు, ఓటు హక్కు, వాక్స్వతంత్రం, మత స్వేచ్ఛ, సమానత్వం లాంటి అనేక హక్కులను భారతీయులకు రాజ్యాంగం ద్వారా అందించిన, మహానేత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ అని, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో, గంగస్థాన్ ఫేస్ టు మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎడ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి మక్కం గంగాధర్, ఉపాధ్యక్షులు బెల్లడిగే చంద్రకాంత్, కోశాధికారి సర్కానీ హులియ, సంయుక్త కార్యదర్శి నీరడీ సాయిలు, సంఘం సలహాదారులు బొడ్డు లక్ష్మణ్, తుక్కడి నారాయణ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News