నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : ఈ సందర్భముగా జియం మాట్లాడుతూ ఈ క్యాలెండర్ లను రామగుండం ఏరియా-1 లోని అన్ని గనులు, జిడికే ఓసి -5 మరియు వివిధ డిపార్ట్ మెంట్స్ కార్యలయములలో పని చేయు అధికారులకు, ఉద్యోగులకు అందజేయబడునని తెలిపారు. సింగరేణి సంస్థ సాదించిన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పచ్చదనం, ఉద్యోగుల సంక్షేమం, సింగరేణిలో ఉన్నటువంటి అత్యాధునిక యంత్రాల ఫోటోలతో రూపొందించిన క్యాలెండర్ ద్వారా మన సంస్థ సాదిస్తున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, ఎఐటియుసి బ్రాంచి సెక్రటరీ అరెల్లి పోషం, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఎన్విరాన్ మెంట్ డిజియం ఆంజనేయ ప్రసాద్, ఎస్టేట్ డిజీ. ఎం కుమార స్వామీ, సివిల్ యస్.ఐ వరప్రసాద్, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రావణ్ కుమార్, హనుమంత రావు, క్రాంతి కుమార్, ఎఐటియుసి ప్రతినిది రాజు పాల్గొన్నారు.





