Tuesday, March 10, 2026

మోహన్ బాబు విద్యానికేతన్ లో సంక్రాంతి సంబరాలు…

  • భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు

నేటి సాక్షి, ప్రతినిధి, తిరుపతి జిల్లా : చంద్రగిరి మండలం ఎ. రంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా నటుడు, ఛాన్సలర్ మంచు మోహన్ బాబు పాల్గొన్నారు. ప్రతి యేటా విద్యార్థుల తో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, డప్పుల మోతలతో దద్దరిల్లిన విద్యాసంస్థలు వాయిద్యాలు వాయిస్తూ గాలి పటాలు ఎగురవేయడం ఉట్టి కొట్టే పోటీలు కన్నులపండువగా సాగింది. ఈసందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ నేను నమ్ముకున్న షిర్డీ సాయిబాబా నాకు నిత్యం అండగా నిలిచారన్నారు.

గతం గతః ..‌ నిన్న జరిగింది మర్చిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించనని మోహన్ బాబు అన్నారు. రేపు ఇంతకన్నా మంచి పని ఏం చేయాలని ఆలోచిస్తానని చెప్పారు. భారతదేశానికి రైతు వెన్నుముక అన్న ఆయన రైతు బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మా వృత్తిలో సినిమా హిట్ అయితేనే నిజమైన పండుగ అని, మా బ్యానర్ పై చిత్రీకరించిన సినిమాలన్నింటికి సాయి బాబా ఆశీర్వాదిస్తున్నాడు. విజయాలు

సాధిస్తున్నారన్నారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కన్నప్ప ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఈ చిత్రం అంచనాలను అందుకుంటున్న ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News