- డీవీఈవో శివ్వాల తవిటినాయుడు
- అక్షయపాత్ర ఫౌండేషన్ లో ఒక రోజు శిక్షణ
- పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
- నేటి సాక్షి , పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో
నేటి సాక్షి , పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా
సృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు క్షేత్రస్థా యిలో శిక్షణ (ఆన్ ద జాబ్ ట్రైనింగ్) ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం ఇంటర్మీడియట్ విద్య జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి (డీవీఈవో) శివ్వాల తవిటి నాయుడు అన్నారు. వృత్తి విద్య కోర్సుల అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏటా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నరసన్నపేట అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ విద్యార్థులకు శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న ఒకరోజు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోన్న అక్షయపాత్ర ఫౌండేషన్ కార్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సరుకుల సరఫరా, వివిధ రకాల ఆహార వంటల తయారీ విధానం, పంపిణీ, అకౌంటింగ్ పుస్తకాల నిర్వహణ తదితర అంశాలపై సంస్థ మేనేజర్ వెంకటరాజు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మరపట్ల పవన్ సూచనల మేరకు, ఇంఛార్జి ప్రిన్సిపాల్ వదనగిరి ఆదేశాలతో శ్రీకాకుళంలో విద్యార్థులకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ నిర్వహించామని, అధ్యాపకులు దుగ్గివలస రాంప్రసాద్, కొర్రాయి రవి తెలిపారు. డీవీఈవో తవిటినాయుడుతో పాటు జిల్లా ఏజీఎంఓ, లైబ్రేరియన్ తాతారావు అక్షయపాత్ర సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.





