- క్లీనర్ మృతి, డ్రైవర్ కు తీవ్ర గాయాలు
- సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజూరాబాద్ మండలంలోని సింగపూర్ మందాడిపల్లి వద్ద లారీ అదుపుతప్పి చెట్టుని ఢీకొంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. బుధవారం రోజున తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. సుమారు గంటకు పైగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడం వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ మరియు డ్రైవర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది క్రేన్ సహాయంతో లారీ లో నుండి సుమారు గంటసేపు ప్రయాసపడి బయటకు తీసినారు. సీఐ తిరుమల్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో క్లీనర్ మృతి చెందాడు. మృత దేహాన్ని మార్చురీకి తరలించారు.





