- ఇదేమిటనీ అడిగిన మాదిగలపై అక్రమ కేసులు
- అనాదికాలంగా వస్తున్న ఎస్సీ మాదిగల స్మశాన వాటిక

నేటి సాక్షి, కోదాడ, ప్రతినిధి, (అనంతగిరి) : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని పాలవరం గ్రామం లో సర్వేనెంబర్ గల 233 ప్రభుత్వ భూమి ఎస్సీ మాదిగల స్మశాన వాటిక 86 సంవత్సరాలుగా తాతల ముత్తాతలు నుండి అనాది కాలంగా కొనసాగుతూ వచ్చింది. దహన సంస్కారాలు తీసుకపోయే మార్గం మధ్యలో వ్యవసాయానికి పోయే బీ కాలువ అడ్డుగా ఉండటం వలన ఆ కాలువ లో శవాలు కూడా అందులో పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా ఇబ్బందికరంగా ఉన్నాయని పెద్ద మనుషుల సమక్షంలో మరో చోటుకి అందరూ తీసుకుపోయే దాంట్లోకి మార్చారు.

ఇప్పుడు అదే అదునుగా తీసుకొని కొంతమంది ఎవరు అడిగేవాడు లేడు అనే ధీమాతో రాజకీయ పలుకుబడితో అక్రమ తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారు. అడిగిన ఎస్సీ మాదిగలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది ఇలా ఉంది అని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వచ్చి 233 సర్వేగల ప్రభుత్వ భూమి మాదిగల స్మశాన వాటికను సర్వే చేసి పంచనామం చేశారు గెట్ టు రాళ్లు బాది వెళ్లిపోయారు. మరలా గెట్ టు రాళ్లు ఉడపీకి కొంతమంది కబ్జా చేస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు.





