Tuesday, March 10, 2026

ఇందిరా మహిళ శక్తి

  • పి ఎం ఎం ఎస్ వై పథకం ద్వారా లోని విక్రయ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఇందిరా మహిళ శక్తి, పి ఎం ఎం ఎస్ వై పథకం ద్వారా జిల్లా మహిళా సమైక్య సభ్యురాలు గద్వాల జిల్లాలోని ధరూర్ మండల పరిధిలోని రేవుల పల్లి గ్రామానికి చెందిన తెలుగు విజయలక్ష్మి అయ్యన్న గారు ఎంపిక కావడం 10 లక్షల 38 వేల మత్స్యకారుల వాహనము సబ్సిడీ ద్వారా 6 లక్షల రూపాయలు సబ్సిడీ 4 లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు చెల్లించి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా మత్స్యకారుల చాపల వాహనమును రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు తాళం చేయి అందజేశారు. ఎమ్మెల్యే చేపల విక్రయ వాహనాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే కి లబ్ధిదారులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ .. మత్స్యకారుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి , ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా నిలవడానికి కృషి చేయడం జరుగుతుంది. మహిళా సమైక్య లో మహిళలు ఎదగడం వల్ల ఆ కుటుంబం కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారుల సంబంధించిన కాకుండా ఇంకా పలు రకాల చిన్నచిన్న కుటీర పరిశ్రమలు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్ ద్వారా మహిళలు పలు రంగాలలో రాణించాలి అప్పుడే అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది వారు కూడా సొంతంగా వ్యాపారం చేసి సొంత పైన నిలబడి కాశం ఉంటుంది భవిష్యత్తులో గద్వాల ప్రాంతానికి మరికొన్ని అవకాశాలు ఇందిరా మహిళా శక్తి అవకాశాలు వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తామని తెలిపారు.
నూతనంగా చాపల విక్రయ వాహనాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన సౌకర్యాలతో జనం ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్, కౌన్సిలర్ శ్రీను, నాయకులు గోవిందు, ధర్మ నాయుడు, భగీరథ వంశీ, కొత్త గణేష్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, సంగీత, జిల్లా అధికారులు, బ్యాంకర్ అధికారి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News