- సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ, డిసిపి ఎం.చేతన తో కలిసి రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల వినియోగం నియంత్రణ పై నిర్వహించిన సమావేశం లో పాల్గొన్నారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలోని రహదారి మీడిల్ వద్ద పిచ్చి మొక్కల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లారీలు, ట్రాక్టర్, భారీ వాహనాలు, కార్లకు ముందు వెనుక తప్పనిసరిగా 10 రోజులలో రేడియం స్టిక్కర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజీవ్ రహదారి పై అవసరమైన చోట పోలీస్, ఆర్.టి.ఓ అధికారుల సమక్షంలో రంబల్ స్ట్రీప్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.రహదారి పై అవసరమైన చోట హై మాస్ లైటింగ్ కోసం ప్రతిపాదనలు అందించాలని అన్నారు. రహదారి పై టర్నింగ్ దగ్గర వెంటనే రేడియం స్టిక్కర్లతో బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. రహదారి పై మీడియన్ వద్ద ఎత్తుగా పెరిగిన మొక్కలు వెంటనే తోలగించాలని అన్నారు.జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై విస్తృత ప్రచారం కల్పించాలని, పౌర సరఫరాల శాఖ తో చర్చించి జిల్లాలో ఒక వారం పేట్రోల్ బంక్ లలో హెల్మెట్ లేకపోతే పేట్రొల్ పోయకుండా వ్యూహాత్మకంగా అమలు చేయాలని అన్నారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడ్ లిమిట్ బోర్డులను, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పాఠశాల వద్ద స్కూల్ జోన్ బోర్డులు ఉండాలని అన్నారు. రొడ్డు పై ట్రాక్టర్లు కేజి వీల్ వినియోగిస్తే వాహనం సీజ్ చేయడం జరుగుతుందని, దీని పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరిగితే దగ్గర లోని ఏ ఆసుపత్రికి తరలించాలో మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ, వీటి వల్ల కలిగే దుష్పరిణామాల పై విస్తృత ప్రచారం నిర్వహించుటకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల పై సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటూ క్యాంపెయిన్ చేపట్టాలని అన్నారు.డ్రగ్స్ వాడకం మనిషి పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిపే వీడియోలను గ్రామ వాట్సాప్ గ్రూప్ లలో ప్రచారం చేయాలని అన్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాలలు,జూనియర్ కళాశాలలు , రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమంలో నిర్వహించాలని అన్నారు. డ్రగ్స్ కు బానిసలు అయిన యువకులు, పిల్లలపై కేసులు నమోదు కాకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా అవసరమైన కౌన్సిలింగ్ చేసి డి అడిక్షన్ సెంటర్ ద్వారా డ్రగ్స్ వాడకం బానిసత్వం పోయేలా చర్యలు తీసుకోవాలని, డి అడిక్షన్ కేంద్రంలో చేరే వ్యక్తుల
- వివరాలు బయట ఎక్కడ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.డిసిపి ఎం. చేతన మాట్లాడుతూ, ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి, ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. రొడ్డు క్రాసింగ్ దగ్గర వీధి దీపాలు లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామని, జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్రాసింగ్ దగ్గర వీధి దీపాలు పెట్టాలో నివేదిక అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈ ఈ బావ్ సింగ్, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, జిల్లా విద్యా శాఖ అధికారి మాధవి, డి.డబ్ల్యూ.ఓ., వేణు గోపాల రావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జిల్లా అటవీ అధికారి శివయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, రవాణా శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





