నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ధర్మపురి సిఐ ఏ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ధర్మపురి ఎస్సై పి ఉదయ్ కుమార్ మరియు ఆర్ ఎస్ ఐ జి దినేష్, పోలీస్ లు జి రాజేందర్ , జి నవీన్ కుమార్ జాతీయ రోడ్డు భద్రత నెల సందర్భంగా ధర్మపురి మండల కేంద్రంలో గల మగ్గిడి గురుకుల జూనియర్ కళాశాల నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ క్రైమ్, మైనర్ రైడింగ్ వల్ల జరుగు ప్రమాదాలను వివరించి తగు సూచనలు ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ పట్ల అవగాహన కల్పించినారు. ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న కొద్దీ, సైబర్ దాడులు, మోసాలు, డేటా లీకులు, మరియు హ్యాకింగ్ వంటి సమస్యలు పెరిగాయి. సైబర్ అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఈ రకమైన ముప్పుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన సూచనలు మరియు పరిష్కారాలు తెలిపినారు. ఇట్టి సదస్సులో మగ్గిడి గురుకుల జూనియర్ కళాశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది





