నేటిసాక్షి, కథలాపూర్: కథలాపూర్ మండలం భూషణ్ రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని కరీంనగర్ లోని తిమ్మాపూర్ గురుకుల పాఠశాలలో శిక్షణ శిబిరంలో పాల్గొని అక్కడి నుంచి జనవరి 8 నుండి 11 (2025) వరంగల్ జిల్లాలోని గీసుకొండలో జరగబోయే రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలలో ఉమ్మడి జిల్లా తరఫున పాల్గొంటుంది, శ్రీనిధి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రాజయ్య , ఫిజికల్ డైరెక్టర్ వి. నవీన్ కుమార్ అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.





