నేటి సాక్షి, మెట్ పల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని మెట్ పల్లి మండలంలోని మారుతి నగర్ శివారులో పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నరన్న సమాచారంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు మారుతి నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోరుట్ల నుండి మెట్ పల్లి వైపు వస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీని పోలీస్ స్టేషన్ తరలించి డ్రైవర్, ఓనర్ పై కేసు నమోదు చేశామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.





