నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో బుధవారం 2025-2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు అధికంగా చేయాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ కరపత్రాన్ని డాక్టర్ కే. వేంకయ్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు కళాశాలలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని, అందుకోసం కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బందికి పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే ఆ కళాశాల దినదినాభివృద్ధి చెందుతుందని, అందుకోసం కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది తీవ్రంగా కృషి చేయాలని ప్రిన్సిపాల్ వేంకయ్య పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి కోసం తమ సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏ. మనోజ్ కుమార్, లెక్చరర్లు గట్టయ్య, అంజయ్య, శ్రీకాంత్, సత్తయ్యలతోపాటు బోధనేతర సిబ్బంది లక్ష్మినారాయణ, బాబు, శ్రీనివాస్, లింగం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





