Tuesday, March 10, 2026

ఎక్సైజ్ కనుసన్నల్లో బెల్ట్ షాపులు

నేటి సాక్షి, మునగాల : ఎవరి వాటా ఎంత, ఎవరికి ఎంత మూడుపులు నెల నెలా వెళ్తున్నాయి.
ఈ మామూళ్ల లెక్కలపై విచారణ జరిపే ఉన్నంత అధికారులు ఆ శాఖలో కరువయ్యారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాలకుల పుణ్యమా అని మంచినీళ్లు దొరకని గల్లీలు ఉన్నాయేమో కానీ మందు దొరకని సందులు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మునగాల మండల పరిధిలోని గ్రామాలలో మద్యం బెల్టు దుకాణాల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతుంది. వ్యాపారుల లాభాపేక్ష అధికారుల అవినీతి పుణ్యమా అని బెల్టు వ్యాపారం గ్రామాలలో జోరుగా సాగుతుంది. వాటిని అడ్డుకోవలసిన మద్యనిషేధ అబ్కారి శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుండటం విమర్శలకు తావిస్తుంది.. మునగాల మండల పరిధిలో ప్రభుత్వం నియమించిన మూడు మద్యం దుకాణాలు ఉండగా. సుమారు 350 పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ. మద్యం వ్యాపారుల ప్రోత్సహంతో కోట్లలో మద్యం అమ్మకాలు మండలంలో నడుస్తున్నాయి. బెల్ట్ వ్యాపారులు రోజుకు 50,000/- కౌంటర్ వ్యాపారం నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో అబ్కారి అధికారుల అవినీతి మత్తు ఉందో తెలుస్తుంది. ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాలు ఉండగా అన్ని ప్రాంతాలలో బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాలలో బెల్టు జోరు విస్తృతంగా కొనసాగుతున్నట్లు సమాచారం. మద్యం దుకాణం వ్యాపారులు గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులకు ఆటోలలో మద్యం సరఫరా చేయటం విశేషం. బెల్టు షాపుల నుంచి ఎక్సైజ్ అధికారులకు ప్రతినెల భారీగా మామూలు వస్తుండటం తోనే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు సైతం లేకపోలేదు. ఎక్సైజ్ అధికారులు టార్గెట్ లక్ష్యంగా వ్యాపారుల ద్వారా మద్యం అమ్మకాలు జరిపిస్తూ వాటిని అమ్ముకునేందుకు అనాధికారికంగా అనుమతులు ఇస్తున్నారు. అబ్కారి శాఖ అధికారులు మండలంలో ఇంతలా బెల్టు షాపులు ప్రోత్సహిస్తున్న ఉన్నంత అధికారులు స్పందించి ఇంతవరకు విచారణ జరిపి చర్యలు తీసుకోకపోవడంతో వారి ముడుపుల వాటాలు ఎంత అనే అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News