Tuesday, March 10, 2026

ఎమ్మార్పీఎస్ మండల సమీక్ష సమావేశం

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు ఆధ్వర్యంలో మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్శరాములు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఏబీసీడీ వర్గీకరణ అమలుకై పీబ్రవరి 7 నాడు హైదరాబాద్ లో 1000 గొంతులు – లక్ష డప్పులు, మాదిగల గుండె చప్పుడు డప్పుల దరువు, కవులు, కళాకారులతో,నిర్వహించే ప్రదర్శన ను విజయవంతం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలో 9 – 1- 2025 న కవులు రచయితలు కళాకారుల ప్రదర్శన రథాలు ప్రారంభం ఆవుతున్న సందర్బంగా, మన మండలంలోని అన్ని గ్రామాల నుండి 100 డప్పులతో కల్లేపల్లి రోడ్ నుండి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీతో వచ్చి, అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి స్వాగతం పలుకుతూ సిద్దిపేట కు పోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో ముఖ్యతిథిగా మండల ఇంచార్జ్ చింతకింది పర్శరాములు, మండల సీనియర్ నాయకులు తాడిచెట్టు భూమయ్య, గూడెం మాజీ సర్పంచ్ మంకాళి బాలయ్య, బోనగిరి గంగరాం , మండల కమిటీ సభ్యులు, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండల నూతన కమిటీకి అలాగే గూడెం గ్రామ సీనియర్ నాయకులు, మండల కార్యవర్గ సభ్యులకు, మండల ఇంచార్జి మరియు సీనియర్ నాయకులను, నూతన మండల కమిటీ శాల్వాలతో సన్మానం చేయడం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News