Tuesday, March 10, 2026

ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్):
ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు గోదావరిఖనిలో NSS ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ సంజీవ్ అధ్యక్షతన యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం ACP మడత రమేష్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు గంజాయి సేవించడం వల్ల జీవితంలో అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యంగా గోదావరిఖని లో యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని దానికి దూరంగా ఉండి మీ కన్నవారి కలలని నిజం చేసి, సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి NSS ప్రోగ్రాం ఆఫీసర్ జీడి కనకయ్య అధ్యాపకులు అబ్దుల్ రెహమాన్, మంతెన శ్రీనివాస్, రాజిరెడ్డి, శంకరయ్య, సతీష్, కమలాకర్, శ్రీ గోదా, ఎస్తేరు రాణి, శారద, రమాదేవి, శైలజ ,రఫిక్, అల్తాఫ్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News