Tuesday, March 10, 2026

మెగా పశువైద్య శిభిరం

నేటిసాక్షి, పెగడపల్లి (కె. గంగాధర్):
పెగడపల్లి మండలం బతికేపల్లె గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ, కరీంనగర్ మరియు పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 184 పశువులకు చూడి (గర్భనిర్ధారణ) పరీక్షలు, కట్టు నిల్వకపోవడం సమస్య లకు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స, కట్టుకు రాని పెయ్యలకు పరీక్షలు, వివిధ రకాల వ్యాధులకు చికిత్స, దూడలకు నట్టల నివారణ మందులు ఇవ్వడం జరిగింది. రైతులకు సబ్సిడీ ధరలో పశుగ్రాస విత్తనాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య & పశుసంవర్ధక అధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతు పాడి పశువులు సంవత్సరం ఒక ఈత ఈనితే పాడిపెంపకం లాభదాయకమని, సమీకృత దాణా వాడితే పాల దిగుబడి పెరుగుతుందని, ఆరోగ్యం గా ఉండి సరైన సమయానికి చూలు కడుతుంది అని తెలియజేసారు. కరీంనగర్ పశుగణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ SP రెడ్డి మాట్లాడుతూ ఆడ దూడలు పుట్టే విధంగా సెక్సడ్ సెమెన్ 250 రూపాయలకు అందుబాటులో వుంది అని, దానిని వినియోగించుకోవాలని, ఖనిజ లవణ మిశ్రమం ఆవశ్యకత గురించి తెలియజేసారు. జగిత్యాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేష్, పాడి రైతులకు పశు పోషణ, పశుగ్రాశ పెంపకం ఉపయోగాలు, అధిక పాల దిగుబడి రావడానికి అనుసరించాల్సిన యజమాన్య పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. అలాగే అధిక పాల దిగుబడి పొందుతున్న పాడి రైతు లను గుర్తించి సన్మానం చేసి, ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి మండల వెటర్నరీ డాక్టర్ లింగాల హేమలత మరియు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల వెటర్నరీ డాక్టర్లు డాక్టర్ కిరణ్ రెడ్డి, డాక్టర్ కమలాకర్, డాక్టర్ రాజేందర్ రెడ్డి, డాక్టర్ అచ్చే శ్రీనివాస్, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాకేష్ మరియు సహాయక సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ లు మతీన్, సంతోష్, గోపాలమిత్ర సూపర్వైజర్ షాదుల్ల, గోపాల మిత్రలు జానీ పాషా, నర్సయ్య, శంకరయ్య, అంజయ్య, శ్రీకాంత్, తిరుపతి మరియు పెద్ద ఎత్తున పాడి రైతులు  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News