Tuesday, March 10, 2026

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన కుమ్మరి పల్లి ప్రధానోపాధ్యాయుడు

నేటిసాక్షి, రాయికల్:
రాయికల్ మండలంలోని కుమ్మరి పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ ఈ నెల 21 నుండి పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక య్యారు. ఈ నెల 7 నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అభయ్రాజ్ పాల్గొని తక్కువ ఖర్చు మరియు ఖర్చు లేని బోధనోపకరణాలను రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా ప్రయోగాలు ప్రదర్శించారు. దాంతో ఈ నెల 21 నుండి పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సన్మానించి బహుమతి అందజేసారు. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము, జగిత్యాల జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, రాయికల్ మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు తదితరులు అభినందించారు. ఫోటో రైటప్: 09RKL02: బహుమతి అందుకుంటున్న ప్రధానోపాధ్యాయులు అభయ్రాజ్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News