నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్
గురువారం రోజు రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా, కామారెడ్డి లోని భవిత పాఠశాలలో, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి డివిజనల్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పౌరులు నియమనిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులు ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించాలని, రూల్స్ ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అడిషనల్ ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమించడం వల్ల, అనేకమంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, కామారెడ్డి డివిజనల్ అడిషనల్ ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిటిఓ శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణ తేజ, ఇర్షద్ అలీ, శంకర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.





