నేటి సాక్షి గోదావరిఖని (రమేష్).
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు సతీమణి మనాలి ఠాగూర్ గోదావరిఖని కోదండ రామాలయం ఆలయాన్ని సందర్శించారు. వైకుంఠ ద్వారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తులకు ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఈ పవిత్ర రోజున కోదండ రామాలయం. దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమైనది. ప్రజల సంక్షేమం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని స్వామి ప్రార్థించాను అని తెలిపారు. ఆలయ పరిసరాలను పర్యటించిన ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.





