- సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేదించిన పోలీసులు..
- చిన్నారి అద్వితను తల్లిదండ్రులకు అప్పగింత..
- నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన..
- ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్..

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక మిస్సింగ్ కేసు శుక్రవారం సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. లాస్యకు మతిస్థిమితం లేకపోవడంతో మధు కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నా నేపథ్యంలో లాస్య తన కూతురు సింగారపు అద్విత (4) రాజన్న దర్శనానికి వేములవాడ వచ్చి ఇక్కడే ఉండగా మహబూబాద్ కి చెందిన ముగ్గురు మహిళలలు వేములవాడ రాజేశ్వరస్వామి దేవస్థానానికి రాగా లస్యతో చనువు ఏర్పడి అందరు కలిసి దాదాపు 5 రోజులుగా వేములవాడ గుడి ఆవరణలో నిద్ర, మొక్కులు తీర్చుకున్నారు. ఇది ఇలా వుండగా పాప యొక్క తల్లి లాస్య మతిస్థిమితం కారణంతో పాపను సరిగా చుడుకోవడం లేదని గ్రహించిన ముగ్గురు అనుమానిత మహిళలు పాపని దగ్గరకి తీసుకొని పరిచయం పెంచుకొని నమ్మించి, అదే అదనుగా భావించి డిసెంబర్ 23న పాపను మహిళలు తీసుకెళ్లగా, సంఘటన తెలుసుకున్న మేన మామ పలమారు గంగస్వామి డిసెంబర్ 30న వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు..
పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలిక మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా సృషించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం గత పది రోజులుగా పాపను గుర్తించే పనిలో పడ్డారు. కేసులో ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ జిల్లా పోలీసులు ఈ కేసును చాలెంజ్ గా తీసుకొని ఎస్పీ అఖిల్ మహజన్ ఆధ్వర్యంలో వేములవాడ సిఐ వీర ప్రసాద్ లు పోలీస్ సిబ్బందితో కలిసి, ఏడు స్పెషల్ టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రాజరాజేశ్వర దేవస్థానం, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోదాడ పరిసర ప్రాంతాలలో గల సిసి కెమెరాలు పరిశీలించి ఆధునిక సాంకేతికను ఉపయోగించి నిందితులు మహబూబాబాద్ జిల్లలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్లు తెలుసుకొని ఆ గ్రామ ఉప సర్పంచ్ సహాయంతో శ్రీరామోజీ వెంకట నరసమ్మ, గంభీరపు అంజవ్వ, కునపురి ఉప్పమ్మ ల వద్ద నుండి పాపాను కాపాడి ఆ ముగ్గురు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అనంతరం అద్విత ను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, వేములవాడ టౌన్ సి.ఐ వీరప్రసాద్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్,ఎస్ఐలు సుధాకర్, రమేష్, జునైద్ మరియు సిబ్బంది తిరుపతి,రాజేష్, అక్షర్, శ్రీనివాస్, మహిపాల్, ఇమ్రాన్, గోపాల్, బాబాయ్ లను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంశ పత్రాలు అందించారు. మీడియా సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ లు వీరప్రసాద్, సదన్ కుమార్, ఎస్.ఐ లు సుధాకర్, రమేష్, జునైద్, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి..!
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..
జిల్లా ప్రజలందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని చెప్పారు. పట్టణాల్లో, గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని, నేరస్థులు సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని తెలిపారు. పటిష్టమైన సీసీ కెమెరాల రక్షణ వ్యవస్థ ఉండడం తో ప్రజల్లో భరోసా ఉంటుందన్నారు. దొంగతనాలు, ఇతర నేరాలను అలాగే రోడ్డు ప్రమాదాలు, నిందితులను అరెస్టు చేయడంలో కెమెరాలు సహాయపడతాయని, ఎవరైనా అనుమానంగా వ్యక్తులు ఉంటే పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు సూచించారు.





